Banner
Watermark
ఉచిత విద్యుత్ పథకం – ప్రజలకు ప్రయోజనం
📅 09 June 2026, 03:25 PM ✍️ admin
News Image
[2:58 PM, 6/9/2026] +91 91822 11810: జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో రూ. 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించిన నూతన సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కచే ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఘనపూర్ (స్టేషన్) ప్రాంత అభివృద్ధికి ఈ విద్యుత్ సబ్ స్టేషన్లు కీలకమన్నారు. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం దేవాదుల ప్రాజెక్టు, ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుల ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రఘునాథపల్లి 132 కేవీ సబ్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, లైన్ షిఫ్టింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కూడా కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరా రైతు సేవా కేంద్రాల మహిళలకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 60.62 కోట్ల వ్యయంతో ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లోడ్ మేనేజ్‌మెంట్ మెరుగుపడటంతో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉంటుందని తెలిపారు.

తదనంతరం ట్రాన్స్‌కో సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్ రంగ అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు. అధిక లోడ్ సమయంలో సమర్థవంతమైన విద్యుత్ నిర్వహణ ద్వారా సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయని, వ్యవస్థ మరింత బలపడుతుందని వివరించారు.
[3:13 PM, 6/9/2026] +91 91822 11810: అదే విధంగా ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీ నిధి రుణాల కింద రూ. 3,07,00,000, అలాగే బ్యాంకు లింకేజ్ కింద 407 స్వయం సహాయక సంఘాల రూ. 32,89,96,000 చెక్కులను మహిళలకు అందజేశారు.
🏠 Home