• Other News
  • Live TV
  • సమిష్టిగా రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

    Reporter
    admin January 1, 2026, 4:14 pm
    సమిష్టిగా రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

    ప్రభాతదర్శిని కరీంనగర్ జనవరి 01 :
    కరీంనగర్ జిల్లాలో సమిష్టిగా అందరం కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
    జాతీయ రోడ్డు మాసోత్సవం సందర్భంగా గురువారం రవాణా శాఖ, ఆర్టీసీ, ఆర్ అండ్ బి ఎక్సైజ్ పోలీసులు నేషనల్ హైవే తోపాటు వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించేలా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని తద్వారా వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలని చెప్పారు. ఇందుకు ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
    నిర్లక్ష్యము జాగ్రత్తగా అతివేగము డ్రంకన్ డ్రైవ్ మొబైల్ ఫోను మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడపవద్దని సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో అధికారులు విద్యార్థులను విస్తృతంగా భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రవాణా శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
    వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పత్రాలను తీసుకెళ్లాలని చెప్పారు. కండీషన్‌లో ఉన్న వాహనాలనే నడపాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ పోస్టర్లు కరపత్రాలను అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిటిసి పురుషోత్తం డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి,ఆర్టీసీ ఎక్సైజ్ ఆర్ అండ్ బి నేషనల్ హైవేస్ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow