• Other News
  • Live TV
  • ఏ.టి.సి నైపుణ్య శిక్షణ కోర్సుల ద్వారా ఉపాధి...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    Reporter
    admin January 5, 2026, 4:27 pm
    ఏ.టి.సి నైపుణ్య శిక్షణ కోర్సుల ద్వారా ఉపాధి...జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

    అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
    పెద్దపల్లి, జనవరి-05:-
    ఏ.టి.సి నైపుణ్య శిక్షణ కోర్సుల ద్వారా యువతకు తప్పనిసరిగా ఉపాధి లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏ.టి.సి సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఏ.టి.సి, ఐటిఐ సెంటర్ ద్వారా అందిస్తున్న కోర్సుల వివరాలు, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఎంత మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి,
    వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ప్రారంభించిన ఏ.టి.సి సెంటర్ లో సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 70 మంది ఉద్యోగులకు ఉపాధి లభించడం జరిగిందని అన్నారు.టాటా సంస్థ సౌజన్యంతో షార్ట్ టర్మ్ కోర్సుల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఏ.టి.సీ కోర్సులు పొందేందుకు అర్హులని ,ఈ కోర్సులతో మల్టి నేషనల్ కంపెనీలలో తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.మన జిల్లాలో ఒక సంవత్సరం కాలపరిమితి గల మ్యాను ఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యాను ఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టీసీ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ కోర్సులలో 40 సీట్లు ఉన్నాయని, రెండు సంవత్సరాల కాల పరిమితి గల బేసిక్ డిజైనర్ అండ్ పర్చుయల్ వెరిఫైర్(మెకానికల్), అడ్వాన్సుడ్ సి.ఎన్.సి మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులలో 24 సీట్లు ఉన్నాయని తెలిపారు.ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ ప్రకారం టాటా కన్సల్టిస్ వారితో సమన్వయం చేసుకొని ఈ కోర్సులను డిజైన్ చేశామని అన్నారు. జిల్లాలో ఉన్న యువత యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోర్సులలో జాయిన్ కావాలని కలెక్టర్ కోరారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోరారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రంలో ప్రవేశాలకు కనీస వయసు 14 సంవత్సరాలు మాత్రమేనని అన్నారు.ఈ పర్యటనలు జిల్లా కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, ట్రైనింగ్ అధికారులు శ్రీనివాసు, మల్లికార్జున్, సూపరింటెండెంట్ కృష్ణ వేణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    .

    📰 e-Paper Clip
    Google News Follow