వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీ.హెచ్.సీ)ని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు,ఇతర గదులు, ఆవరణలో పరిశీలించారు.ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఏ.ఎన్.ఎం. లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీని ద్వారా ముందు గానే వ్యాధి లక్షణాలను గుర్తించి, అవసరమైన చికిత్స అందించడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. రిజిస్టర్ లు అన్ని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. ప్రసవాల సంఖ్యపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణం, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని వైద్యాధికారికి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం