మహిళా దినోత్సవంలోగా అందుబాటులోకి తీసుకురావాలి
ఐఎంఎస్ భవన నిర్మాణ పనుల పరిశీలనఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ. ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా భవన నిర్మాణ ప్లాన్ లను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి కాగా, గోడల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అన్ని గదులు పరిశీలించి.. ఎప్పటిలోగా పూర్తి అవుతాయో ఆరా తీశారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భవన పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచి మార్చి 08వ తేదీలోగా పూర్తి చేయాలని ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డిని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.పరిశీలనలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఈ సతీష్ తదితరులు ఉన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం