• Other News
  • Live TV
  • తుది దశలో మేడారంలో గద్దెల పునర్నిర్మాణ పనులు భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి

    Reporter
    admin January 16, 2026, 6:11 pm
      తుది దశలో మేడారంలో గద్దెల పునర్నిర్మాణ పనులు భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాజన్న ఆలయ  అభివృద్ధి

    రాజన్న ఆలయ అభివృద్దికి నిధులు తుది దశలో మేడారంలో గద్దెల పునర్నిర్మాణ పనులుభక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమానికి నిధులు మహిళా సంఘాలకు భవనాలు నిర్మిస్తాము
    పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రూ. కోటి నిధులతో తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఇంచార్జి కలెక్టర్ తో కలిసి శంకుస్థాపన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను రూ. కోటితో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి భక్తుల విశ్వాసాలు, నమ్మకాలకు అనుగుణంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణకు రెండు బడ్జెట్ లలో కలిపి రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేశారని, సీఎం, ఇతర మంత్రులు హాజరై ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, వివిధ శాఖల నుంచి నిధులు తీసుకువచ్చి వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మన్ కుమార్ చేసిన కృషి, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, ఆసక్తితో రాజన్న ఆలయ విస్తరణకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులకు రూ. 200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసారని వెల్లడించారు. వందల ఏండ్లపాటు చరిత్రలో నిలిచేలా..చరిత్ర తెలిసేలా నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని వివరించారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేసారు. మేడారం జాతరకు ఇక్కడి భక్తులు రావాలని కోరారు. ఇటు రాజన్న ఆలయ విస్తరణ పనులు, మేడారం గద్దెల పునర్నిర్మాణ పనులు జరుగుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి సంతోషంగా ఉన్నారని వివరించారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు పూర్తి అయిన తరువాత వస్తానని తెలిపారు.

    జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్ల నిధులతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మిస్తున్నామని, మండలాల్లో సైతం భవనాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. 60 ఏండ్ల వయసు వారు కూడా మహిళా సంఘాలలో చేరవచ్చని వివరించారు. అర్హులైన మహిలందరూ మహిళా సంఘాల్లో చేరాలని, వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్ లు, సోలార్ యూనిట్లు, స్వయం ఉపాధి యూనిట్ లు, స్కూల్ యూని ఫారం కుటించే బాద్యత కూడా అప్పగించామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్ లు సిరిసిల్లకే కేటాయించామని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాద్యులు మిగతా చీరలు త్వరగా ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో పంపిణి చేయాల్సి ఉందని తెలిపారు. మహిళా సంఘాల్లోని సభ్యులు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే రుణ సహాయం కూడా అందిస్తున్నామని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటి ఈశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒకే సంస్కృతి ఉందని, ఈ ప్రాంత అభివృద్దికి అందరం కలిసి సిఎంను కలుస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రెండు లక్షల రుణ మాఫీ ఇలా ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసున్నదని తెలిపారు. విప్ అడిగిన పనులకు మంత్రి సానుకూలగా స్పందించారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. వేములవాడ పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 150 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే పట్టణంలో సుమారు 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టామని, 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కీలకమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా మల్లారం జంక్షన్ నుంచి బతుకమ్మ తెప్ప, బ్రిడ్జి మీదుగా జగిత్యాల బస్ స్టాండ్ (సాయి రక్ష) వరకు మొత్తం 3. 6 కిలోమీటర్ల పరిధిలో 146 విద్యుత్ స్థంబాలతో సుందరీకరణ పనులకు సుమారు 2 కోట్ల 65 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. జంక్షన్ల అభివృద్ధి కోసం తిప్పాపూర్ జంక్షన్ వద్ద కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ శాఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు విడుదలవుతు న్నాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని 28 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, అదనంగా మరిన్ని ప్రాంతాల్లో పనుల కోసం 4 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా టూరిజం శాఖ ద్వారా వేములవాడ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యానికి 1 కోటి 40 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. వేములవాడలో దసరా పండుగ సందర్భంగా మహాలక్ష్మి వీధిలో జమ్మి చెట్టు వరకు నడకకు ఇబ్బందులు లేకుండా 35 లక్షల రూపాయలతో పనులు చేపట్టినట్లు వివరించారు. కుల,మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం రూ. 1.30 కోట్లు, బీసీ భవన్ రూ. - 1.30 కోట్లు, ఎస్టీ భవన్ రూ.- 1.30 కోట్లు, క్రిస్టియన్ భవన్ రూ. - 1.30 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే వేములవాడ పట్టణంలో ముస్లింలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న షాదీ ఖానా అసంపూర్తి భవన నిర్మాణానికి 80 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించామని వెల్లడించారు. మురుగు నీరు గుడి చెరువులో, మూలవాగులో కలవకుండా నివారించేందుకు 10 కోట్ల రూపాయలతో ప్రత్యేక మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నా యన్నారు. గంగమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే మార్గంలో బ్రిడ్జి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గంగపుత్రులకు ఇచ్చిన హామీ మేరకు 80 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. వేములవాడ పరిధిలోని నాంపల్లి గుట్ట నుండి సంకేపల్లి వరకు పాత రోడ్డు ఉందని దానిని అభివృద్ధి చేయాలని, కోనాయపల్లి కాషాయపల్లి మధ్యలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, బాలానగర్ షత్రాజ్ పల్లి మధ్యలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, రుద్రంగి భీమారం మండలాల్లో ఎంపీడీవో కార్యాలయం నిర్మాణం చేపట్టాలని మంత్రిని ప్రభుత్వ విప్ కోరారు.
    ఆలయ విస్తరణ పనుల్లో పాలుపంచుకోవడం అదృష్టం వీటీఏడీఏ వైస్ చైర్మన్, ఇంచార్జి కలెక్టర్ గా శ్రీ రాజ రాజేశ్వర ఆలయ అభివృద్ధి పనుల్లో బాగస్వామి కావడం అదృష్టమని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. తిప్పాపూర్ జంక్షన్ వద్ద శివుడి థీమ్ తో అభివృద్ధి చేస్తామని వివరించారు. వీటీఏడీఏ ఆద్వర్యంలో రాజరాజేశ్వరస్వామి ఆలయంతో పాటుగా బద్ది పోచమ్మ ఆలయం, గుడి చెరువు సుందరికరణ, వేములవాడ మున్సిపల్ రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి పనులు చేయిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆర్డీఓ రాధాభాయ్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow