• Other News
  • Live TV
  • కేంద్ర ఆరోగ్య పథకాలపై సమీక్ష

    Reporter
    admin January 17, 2026, 4:53 pm
    కేంద్ర ఆరోగ్య పథకాలపై సమీక్ష

    జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల:17.1.2026 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల గారు అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు కేంద్ర ఆరోగ్య పథకాలపై సమీక్ష సమావేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి కార్యక్రమంలో( రక్తపోటు, డయాబెటిస్, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ కాన్సరు, నోటి క్యాన్సర్) ఆన్లైన్లో నమోదు, పరీక్షల వివరాలు సమీక్షించి ఈ నెల చివరి వరకు75 శాతం లక్ష్యాలు సాధించాలని సూచిస్తూ, కేంద్ర ఆరోగ్య పథకాలు లక్ష్యాలు 100% సాధించాలని సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ అనిత మరియు డీడియం, సి హెచ్ ఓ గార్లు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow