• Other News
  • Live TV
  • పరిపాలన అంశాలపై అధికారులు దృష్టి సారించాలి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    Reporter
    admin January 23, 2026, 4:17 pm
    పరిపాలన అంశాలపై అధికారులు దృష్టి సారించాలి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    పెద్దపల్లి, జనవరి -23:
    పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పరిపాలన అంశాలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిపాలన అంశాల పై అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ , తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రతి శాఖ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న ఖాళీల వివరాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల వద్ద అందుబాటులో ఉన్న ఇంట్రెస్ట్ ఫండ్స్ వివరాలను అందించాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ పెండింగ్ ప్రతిపాదనలు వారం రోజుల లోగా క్లియర్ చేయాలని అన్నారు. ప్రతి శాఖ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలని, ప్రోటోకాల్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్ కు అగ్నిమాపక,ఇరిగేషన్, ఇతర శాఖలు అవసరమైన ఎన్.ఓ.సి జారీ చేయాలని అన్నారు. కోర్టు కేసులకు సంబంధించి ప్రతి శాఖ వివరాలను జనవరి 28 నాటికి ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులను నిర్దిష్ట సమయం లోగా క్లియర్ చేయాలని అన్నారు. కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయని పాత సామాన్లు, కంప్యూటర్లను టేబుల్స్ తొలగించాలని అన్నారు. విధులకు సిబ్బంది సకాలంలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి సందేశాన్ని క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను షిఫ్ట్ చేయాలని అన్నారు. కలెక్టరేట్ వెబ్సైట్లో ప్రతి శాఖకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని అన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow