రాజన్న సిరిసిల్ల, జనవరి - 27
వచ్చే నెల ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 16 వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్ లో అదనపు ఎస్పీ డి.చంద్రయ్య తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ అనుమతించరాదని ఆదేశించారు.వేసవి దృష్ట్యా వైద్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీస్ సిబ్బందికి డ్యూటీ కేటాయించాలని సూచించారు. కేంద్రాల్లో పరీక్ష రాసే వారికి అన్ని వసతులు కల్పించాలన్నారు.కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్ కుమార్, వైద్య ఆరోగ్య, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోస్టల్, ఇంటర్మీడియట్ విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం