హెల్ప్ లైన్ సెంటర్, కంట్రోల్ రూమ్, మీడియా సెల్ ఏర్పాటు
కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 233 1495
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభం
రాజన్న సిరిసిల్ల, జనవరి - 28
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్, మీడియా సెల్ ను ఏర్పాటు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, మీడియా సెల్ ను అదనపు కలెక్టర్ బుధవారం ప్రారంభించారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని సూచించారు. ఎన్నికల ఫిర్యాదుల ఉంటే ప్రజలు కంట్రోల్ రూం నెంబర్ 1800 233 1495 అందుబాటులో ఉంటుందని, ఫోన్ చేసి చెప్పవచ్చని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్, భారతి తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం