• Other News
  • Live TV
  • ఓటరు... కోటర్ విధానము మారాలి ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు

    Reporter
    admin January 29, 2026, 12:37 pm
    ఓటరు... కోటర్ విధానము మారాలి ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు

    రాష్ట్రము లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మ్రోగింది అభ్యర్థులుఇంటింటి ప్రచారానికి వస్తారు ఓటర్లను వివిధ రకాల ప్రలోభాలకు గురి చేస్తారని ఓటరు ప్రలోబాలకు లొంగకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా వార్డు డివిజన్ సమస్యలపై అవగాహన ఉన్నవారినే ఎన్నుకోవాలని ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ఆర్గనై్జింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కోటర్లు మద్య మాంసాలు డబ్బు పంచేవారిని నమ్మొద్దని గెలిచిన తరువాత వారు వడ్డీతో వసూలు చేస్తారని దాని ద్వారా వార్డులు డివిజన్ లు అభివృద్ధికి నోచుకోవని అన్నారు.మద్య మాంసం కు కు ఆశపడి ఓటు వేసే వారు వారికీ తెలియకుండా వారి భవిష్యత్ ను వారే కుదువ పెట్టుకొని బానిసత్వం లోకి వెళుతున్నారని గ్రహించాలని ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు అన్నారు వార్డు డివిజన్ ల సమస్యలపై అవగాహన కలిగి సేవా గుణం కలిగిన వారిని మాత్రమే ఎన్నుకోవాలని చుట్టమనో పక్కమనో స్నేహితులనో చూడకుండా నిబద్దత కలిగిన మంచి నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు. ఐదు సంవత్సరాల వార్డు డివిజన్ ల అభివృద్ధి ని వారిచ్చే మందు మాంసం డబ్బులకు కుదువ పెట్టి మీ గౌరవాన్ని మీ కుటుంబ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని వారిచ్చే కోటర్ మాంసం ఒక్కరోజు తో తీరిపోతుందని ప్రతి ఓటరు గమనించాలని అన్నారు.పోటీ చేసే నాయకులు కూడా ఓటర్లని డబ్బుతో కొనాలని చూడకుండా నిజాయితీగా గెలుపు కొరకు ప్రయత్నించాలని ఆ ప్రయత్నం చేయనివారు పశువుతో సమానమని అన్నారు.నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మద్య మాంసాలు డబ్బులు పంచకుండా గెలవాలని అట్టి గెలుపు నాయకుల గౌరవాన్ని పెంచుతాయి అని అట్టి నాయకుడు ఓడినా గెలిచినట్లేనని అన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow