తేదిః 30.01.2026.
జనగామ జిల్లా.
జిల్లా కలెక్టర్ తో ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ బేటి
మున్సపిల్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్ల పై వివరించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ........
జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ అబ్జర్వర్‌గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహరెడ్డి (ఐ.ఏ.ఎస్.,) శుక్రవారం జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తన ఛాంబర్‌లో భేటి అయ్యరు, పూల బోకేను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జనగామ మున్సిపాలిటీ 30 వార్డులు, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలలో 18 వార్డుల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్ల పై సాధారణ అబ్జర్వర్కు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వివరించారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు గ్రామపంచాయితీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన టీచర్లను, రెవెన్యూ, ఇజిఎస్ పనిచేస్తున్న అధికారులను నియమించామని ఆయన తెలిపారు.ఎన్నికల నిబందనలు అనుగుణంగా పూర్తిస్ధాయి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అబ్జర్వర్ వివరించారు. ఈ బేటిలో అదనపు కలెక్‌బర్ (స్ధానిక సంస్ధలు) పింకేష్ కుమార్, జెడ్పీ సిఇఓ మాదురి షా , జనగామ మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ (హౌసింగ్ ) మాతృనాయక్ , తదితరులు పాల్గొన్నారు.
TELANGANA JANGOAN
జిల్లా కలెక్టర్ తో ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ బేటి మున్సపిల్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్ల పై వివరించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **