• Other News
  • Live TV
  • ఎస్. సి విద్యార్థిని/ విద్యార్థుల నుండి ధరఖాస్తుల స్వీకరణ

    Reporter
    admin January 31, 2026, 4:04 pm
    ఎస్. సి  విద్యార్థిని/ విద్యార్థుల నుండి ధరఖాస్తుల స్వీకరణ

    తేది:- 31-01-2026
    జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి, కార్యాలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా
    అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకమునకు ఎస్. సి విద్యార్థిని/ విద్యార్థుల నుండి ధరఖాస్తుల స్వీకరణ తేది:- 01-02-2026 నుండి 31-03-2026 వరకు 2026 వ, విద్యా సం.నకు గాను తెలంగాణ ప్రభుత్వం విదేశీ విశ్వ విద్యాలయములల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ద్వారా నిరహించబడుచున్న“అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకము” ద్వారా షెడ్యూల్డ్ కులములకు చెందిన విద్యార్థులకు రూపాయలు 20.00 లక్షలు స్కాలర్షిప్ అంధించుటకు నిర్ణయించడమైనది. USA, UK, Australia, Canada, Singapur, Germany, Japan, South Koria, Newziland, విశ్వ విద్యాలయములలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో చదువలనుకుంటున్న ఎస్.సి. విద్యార్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి. కావున విదేశాలలో చదువుకోవాలని ఆసక్తి గల విద్యార్థులు తేది:- 01-02-2026 నుండి 31-03-2026 వరకు ఆన్ లైన్ లో E-Pass website (www.telangana.epass.cgg.gov.in) నందు ధరఖాస్తు చేసుకోవాలని మరియు ఎంపికైన విద్యార్థులకు రూపాయలు 20.00 లక్షల తో పాటుగా Visa మరియు Ticket Fare లను కూడా మంజూరు చేయగలమని ఇట్టి అవకాశమును వినియోగించుకోగలరని తెలియజేసినారు.అభ్యర్థుల అర్హతలు:- (1). రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన ఎస్. సి. కులము వారై ఉండాలి. (2) సంవత్సర ఆదాయము రూపాయలు 5,00,000/- లోపు ఉండాలి. (3) పి.జి. చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి. (4) TOFEL/IELTS/GRE/GMAT లో ఎక్కువ శాతము అర్హత కలిగి ఉండాలి. (5) PASSPORT నందు VISA అర్హత కలిగి ఉండాలి. (6) విదేశీ విశ్వ విద్యాలయముల నందు అర్హత పొంది ఉండాలి. (7) ఒక కుటుంబం నుండి కేవలం ఒక్కరూ మాత్రమే ఈ పథకమునకు అర్హులు. ఇతర వివరములకై కార్యాలయ పని వేళలో యందు 7989384801 నంబర్ సంప్రధించగలరు.

    📰 e-Paper Clip
    Google News Follow