రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -06
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు ముందురోజు, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా పరిశీలించాలని, ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి, అట్టి నివేదికను ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళినీ, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తునే పోలింగ్ టీంలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల నియమావళి అమలు, తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు.
TELANGANA RAJANNA SIRCILLA
స్వేచ్ఛగా ఓటింగ్ లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ _______
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం