పెద్దపల్లి, ఫిబ్రవరి-07:
సమాచార ,పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు 28-02-2026 తో ముగియనున్నందున, అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం సమాచార మరియు ప్రజాసంబంధాల కమిషనర్, హైదరాబాద్ వారికి పంపించాలని సూచించారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి సమర్పించాలన్నారు.యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార ,పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.జిల్లా స్థాయిల జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డు కోసం ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీ 09-02-2026 నుంచి ప్రారంభం అవుతుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
TELANGANA PEDDAPALLI
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం