రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి - 07
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం పరిశీలన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కోసం సిద్ధం చేసిన ఫారాలను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, 8వ తేదీ ఆదివారం కూడా ఓటు హక్కు వినియోగించుకో వచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కునేవారు సంబంధిత ఫారాలు అన్ని జత చేసి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు.
TELANGANA RAJANNA SIRCILLA
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం