• Other News
  • Live TV
  • పీ.హెచ్.సిలో ప్రసూతి సంఖ్య పెంచాలి వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

    Reporter
    admin February 7, 2026, 5:10 pm
    పీ.హెచ్.సిలో ప్రసూతి సంఖ్య పెంచాలి    వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

    ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరచాలి ప్రభుత్వాసుపత్రిలో డెలివరీలపై అవగాహన కల్పించాలి పీ.హెచ్.సిలో ప్రసూతి సంఖ్య పెంచాలి వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వివిధ సామాజిక ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చిన అధునాతన పరికరాలను ఉపయోగిస్తూ రోగులకు మరింత విస్తృత సేవ అందించాలని అన్నారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత మందుల వివరాల బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గైనకాలజీ, పిల్లల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో గర్భిణీలు, శిశువులకు సేవలు అందించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. శుక్రవారం సభలకు వైద్యాధికారులు హాజరై ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు లభించే ఉచిత పరీక్షలు, మందులు, చికిత్స పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు. తద్వారా ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచవచ్చని సూచించారు. అతిగా బరువు తక్కువ ఉన్న చిన్నారులను గుర్తించి ఎన్.ఆర్.సికి రిఫర్ చేయాలని అన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రులకు అత్యవసరంగా కావలసిన ఇతర పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో రోగుల అటెండర్లు కూర్చునేందుకు బెంచీలు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వయసును బట్టి చిన్నారులకు, శిశువులకు ఇవ్వాల్సిన అన్ని రకాల టీకాలను సమయం ప్రకారం ఇవ్వాలని ఆదేశించారు. టీకాల సమయం విషయంలో తల్లిదండ్రులను అప్రమత్తం తెలిపారు. ఇమ్యునైజేషన్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీబీ పరీక్షల సంఖ్య పెంచి జబ్బు ఉన్న వారిని గుర్తించాలని, మందులు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, జి.జి.హెచ్ ఆర్.ఎం.ఓ నవీన ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow