జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ సమావేశానికి హాజరయ్యారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నదులపై చెక్ డ్యాములు నిర్మించినచోట భద్రత దృశ్య డ్యాముకు ఎగువన, దిగువన 300 మీటర్ల వరకు ఇసుక తోడడం నిషేధమని, అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా పరిధిలోని నదీ ప్రవాహాలకు సంబంధించి సరిహద్దులను పక్కాగా గుర్తించాలని, రికార్డు చేయాలని సూచించారు. ఇరిగేషన్, రెవిన్యూ, ఆర్.డబ్ల్యూ.ఎస్, టిజిఎండిసి, పోలీస్ అధికారులు సమన్వయంతో ఇసుక రీచ్ లను తనిఖీ చేయాలని అన్నారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ పోర్టల్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కేటాయింపు పై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ డిడి శ్యాంప్రసాద్ నాయక్, డిపిఓ జగదీశ్వర్, జిల్లా జియాలజిస్ట్ ప్రసన్న, డి ఈ ఈ రాజేందర్, డిప్యూటీ డిఈ వేణుగోపాల్, మైండ్స్ ఏడి రాఘవరెడ్డి, టీజీఎండిసి పిడి శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ రవి, ఆర్ఓ కనుక జ్యోతి పాల్గొన్నారు.
TELANGANA KARIMNAGAR
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం