• Other News
  • Live TV
  • బ్రాండింగ్,మార్కెటింగ్, సేల్స్ పెరగాలి ఇక్కత్ కళాకారుల జీవనోపాధి మెరుగు పడాలి

    Reporter
    admin February 19, 2026, 5:04 pm
     బ్రాండింగ్,మార్కెటింగ్, సేల్స్ పెరగాలి    ఇక్కత్ కళాకారుల జీవనోపాధి మెరుగు పడాలి

    ఫిబ్రవరి 19
    జనగాం
    బ్రాండింగ్,మార్కెటింగ్, సేల్స్ పెరగాలి

    ఇక్కత్ కళాకారుల జీవనోపాధి మెరుగు పడాలి

    ఎల్లంల కి గుర్తింపు రావాలి

    జిల్లా యంత్రంగం తరపున పూర్తి సహకారం

    జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

    ఇక్కత్ చేనేత కళాకారుల జీవనోపాధి మెరుగుపరచడానికి జిల్లా యంత్రంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని... జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు

    యునైటెడ్ వే హైదరాబాద్ (యుడబ్ల్యుహెచ్), పెర్నోడ్ రిచార్డ్ ఇండియా ఫౌండేషన్ (పీఆర్‌ఐఎఫ్)లు కలిసి చేనేత మహిళా ప్రావిణ్య త శిక్షణ కార్యక్రమాన్ని
    ఎల్లంల లోని వివర్స్ కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసారు

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. జనగామలో కూడా ఇక్కత్ మార్కెటింగ్ పెరగాలన్నారు

    మహిళ లు కొత్త విషయాలను నేర్చుకోవడం లో ఆసక్తి చూపుతారన్నారు

    మార్కెట్ లో ఉన్న డిమాండ్ కి తగ్గట్టు గా కొత్త కొత్త డిజైన్ లను నేర్చుకోని.... వ్యాపార రంగం లో రాణించాలన్నారు

    ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా చేనేత కళాకారులకు రుణాలను మంజూరు చేస్తామని... సద్వినియోగం చేసుకొని... వ్యాపార రంగాన్ని విస్తరించుకోవాలన్నారు

    బ్రాండింగ్, మార్కెటింగ్,సేల్స్ మొదలగు అంశాల్లో మార్పులు రావాలన్నారు

    మిగతా వారికి స్ఫూర్తి కలిగేలా ఈ గ్రామ మహిళ చేనేత కళాకారులూ చేనేత రంగం లో అభివృద్ధి చెందాలన్నారు

    మనకు ఉన్న కళలతో... మన ఊరి లోనే వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలన్న టెక్నీక్స్ తెలుసుకుంటే... ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లి కష్ట పడాలిసిన అవసరం రాదన్నారు

    ఈ కార్యక్రమంలో 50 మంది ప్రీ-లూమ్, 40 మంది లూమ్, 20 మంది నేచురల్ డైయింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు, 77 మంది వృద్ధులు, ప్రత్యేక సామర్థ్య ధారులకు మోధా పెడల్ లిఫ్టింగ్ మెషిన్లు పంపిణీ చేశారు.

    500 మంది చేనేత కళాకారులకు కంటి స్క్రీనింగ్ చేసి 400 మందికి కళ్లద్దాలని అందజేశారు.

    ఈ సమావేశంలో పద్మశ్రీ చింతకిండి మల్లేశం, యుడబ్ల్యుహెచ్ సీఈఓ రేఖా శ్రీనివాసన్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం పల్లె, డిజైనర్ కొండా కవితా రెడ్డి, పీఆర్‌ఐఎఫ్ నుంచి స్మృతి పటార్, లోవిష్ మల్హోత్రా, సొసైటీ ప్రెసిడెంట్ బిర్రు వెంకటేశం, శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow