రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -19
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద టౌన్ మిషన్ కో ఆర్డినేటర్(టీఎంసీ) చంటి రాజమణి మరణించగా, బాధిత కుటుంబానికి స్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మంజూరైన పరిహారం చెక్కును ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం అందజేశారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద టౌన్ మిషన్ కో ఆర్డినేటర్(టీఎంసీ) చంటి రాజమణి సిరిసిల్ల మున్సిపల్ లో పని చేశారు. అక్టోబర్ 2024లో మరణించారు. దీంతో స్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి రూ.1,50,000 విలువైన పరిహారం చెక్కు మంజూరు కాగా, రాజమణి కుటుంబ సభ్యులకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు.
కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఏఓ మీర్జా ఫసహత్ అలీ బేగ్, స్రీ నిధి రీజినల్ మేనేజర్ భూ కైలాస్ తదితరులు ఉన్నారు.