శుక్రవారం సభల్లో అంగన్వాడి, వైద్య సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ తల్లీపిల్లల ఆరోగ్యానికి, పోషణకు శుక్రవారం సభ ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. పిల్లల ఆరోగ్యం పై ఎలాంటి సందేహాలు ఉన్నా శుక్రవారం సభలో ప్రభుత్వ వైద్యునికి తెలియజేయాలన్నారు. ప్రతినెలా అంగన్వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గ్రామాల వారీగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక తెప్పించుకొని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
బరువు తక్కువగా ఉన్న శిశువుల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, అలాంటి పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అతిగా బరువు తక్కువ ఉన్న చిన్నారులను ఎన్ఆర్సి లో చికిత్స అందించి సాధారణ బరువు పెరిగేలా చూస్తున్నామని తెలిపారు.
శుక్రవారం సభలో 95 శాతం మంది మహిళలు ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారని, 245 మంది మహిళలకు రెండవ దఫా స్క్రీనింగ్ పూర్తయిందని, ఇది మంచి విషయమని అన్నారు. శుక్రవారం సభలో ఏర్పాటు చేసే హెల్త్ క్యాంపులను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళా సర్పంచులు శుక్రవారం సభ నిర్వాహణకు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యేంతవరకు పిల్లలను కచ్చితంగా ప్రతిరోజు బడికి, ప్రత్యేక తరగతులకు పంపించాలని కోరారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, శిశువులకు అన్నప్రాసన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య అధికారి వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పురం మాధవి, ఉపసర్పంచ్ వేముల శేఖర్, సిడిపిఓ నర్సింగారాణి తదితరులు పాల్గొన్నారు.
TELANGANA KARIMNAGAR
శుక్రవారం సభ ద్వారా ప్రజారోగ్య పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **