• Other News
  • Live TV
  • సైన్స్ మ్యూజియం పునరుద్ధరణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

    Reporter
    admin February 20, 2026, 4:17 pm
    సైన్స్ మ్యూజియం పునరుద్ధరణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

    సైన్స్ మ్యూజియం పునరుద్ధరణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

    జిల్లా కేంద్రంలోని పురాతన పాఠశాల పరిధిలోగల జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
    అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న గదులను పరిశీలించారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ క్రాఫ్ట్ ప్రదర్శన గురించి పలు సూచనలు ఇచ్చారు. బిర్లా ప్లాంటోరియం నుండి సప్లై చేయబడిన ఇన్ఫినిటీ వెల్ , డిఎన్ఏ మోడల్, బయాలజికల్ మోడల్స్, గ్లోబ్ మోడల్, మ్యాగ్నెటిక్ లైన్స్, వరల్డ్ క్లాక్, సోలార్ పవర్ వంటి ఎగ్జిబిట్ లను పరిశీలించారు. మ్యూజియంలో ఏర్పాటు చేయబోయే ప్రతి ఎగ్జిబిట్ గురించిన పూర్తి సమాచారం ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థులు మ్యూజియం ని సందర్శించి విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకుని వెళ్లేలా తీర్చిదిద్దాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసి మ్యూజియంను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సైన్స్ అధికారులను ఆదేశించారు.
    జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow