• Other News
  • Live TV
  • గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

    Reporter
    admin February 20, 2026, 4:27 pm
    గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

    గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

    సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

    గ్రామం సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ అన్నారు.
    తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు. చొప్పదండి, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలకు చెందిన 50 మంది సర్పంచులకు ఇక్కడ ఈనెల 17 నుండి 21వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారు.
    శిక్షణ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామపంచాయతీ పనుల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ శిక్షణలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్క సర్పంచ్ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని, సాంకేతిక అంశాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తద్వారా ప్రజా సౌకర్యాలపై మరింత శ్రద్ధ పెట్టవచ్చని అన్నారు.
    కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, సర్పంచులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow