రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
శుక్రవారం జనగామ మండలం ఓబుళ కేశవ పురం గ్రామం లో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికం గా సందర్శించి కొనుగోలు పద్దతిని పరిశీలించారు
ఇప్పటి వరకు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోలు అయిన ధాన్యం ఎంత, మిల్లు లకు రవాణా చేసినది ఎంత అని మొదలుగు వివరాలను కలెక్టర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు
తేమ శాతం రాగానే టోకెన్ పద్ధతి ద్వారా
ధాన్యం కొనుగోలు జరగాలని, సరిపడ గన్ని బ్యాగులని అందుబాటులో పెట్టుకోవాలని, కొనుగోలు అయిన ధాన్యం వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని, వెంట వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని... అలాగే వేసవి ఎండల దృష్ట్యా ప్రతీ కేంద్రం లో రైతుల సౌకర్యర్థం మౌలిక వసతులు ఉండాలని కలెక్టర్ తెలిపారు