మేరా యువభారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో మార్చి24 పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రామము నాగిరెడ్డి పూర్, మండలము గంగాధర, జిల్లా కరీంనగర్ యందు మాడల్ యువ గ్రామసభ కార్యక్రమాన్ని యువతీ యువకుల చేత నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గంగాధర ఎంపీడీవో రాము గారు మాట్లాడుతూ ఇలాంటి మాడల్ యువ గ్రామసభ నిర్వహించడం ద్వారా యువతీ యువకులలో గ్రామసభ ఏ విధంగా ఉంటుంది గ్రామంలో పాలనపరమైనటువంటి విషయాలు ఏ విధంగా నిర్వహిస్తారు అనేది అవగాహన కల్పించడం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. యువతి యువకులు వారి వారి గ్రామాలలో కూడా మాడల్ యువ గ్రామ సభలు నిర్వహించాలని గ్రామసభలు నిర్వహించినప్పుడు పాల్గొనాలని కూడా సూచించడం జరిగింది. గ్రామ సభలలో గ్రామ అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాల ప్రణాళికలు తయారు చేసుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిధులుగా మేరా యువభారత్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ ఎం వెంకట్ రాంబాబు, గోలి తిరుపతిరెడ్డి, సర్పంచ్ జి యశోద, ఉపసర్పంచ్ పి. క్రిష్మ, ఏం చిట్టి మండల పంచాయతీ అధికారి, పంచాయతీ సెక్రెటరీ లావణ్య మరియు మండలంలోని యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.
**
ఇట్లు
ఎం. వెంకట్ రాంబాబు,
డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మేరా యువభారత్, కరీంనగర్ జిల్లా.
M.No.9177329258