• Other News
  • Live TV
  • నేటి ప్రభాతదర్శిని సిరిసిల్ల బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

    Reporter
    admin April 25, 2026, 5:12 pm
    నేటి ప్రభాతదర్శిని  సిరిసిల్ల బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

    బాల్య వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ఈ సామాజిక సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం, అధికారులు, తల్లిదండ్రులు మరియు సమాజం కలిసి పనిచేయడం అత్యంత అవసరమని మరియు బాధితులకు సహాయం అందించడం ద్వారా మాత్రమే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది శ్రీ. ఆడెపు వేణు గారు అన్నారు.

    శనివారం కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ భూక్య రెడ్డి తండా(వట్టిమల్ల)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి.నీరజ గారి ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, DLSA శ్రీ. పి.లక్ష్మణాచారి గారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ఆశా-2025, (Awareness, Support, Help and Action) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయబడుతుందని తెలిపారు. బాల్య వివాహం జరగబోతున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు తేలియజేయాలని కోరారు. ఈ సదస్సులో లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, న్యాయవాది తవుటు మధుసూదన్, గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్, ఉప సర్పంచ్ లకవత్ రాజు, ASI.ఎన్.తిరుమల బాబు, కానిస్టేబుల్ జగన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర