ఏప్రిల్ 29
జనగాం
డీజిల్, పెట్రోల్ సరఫరా పైన అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలనీ... ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ జిల్లా కలెక్టర్ సందీప్ కూమర్ ఝా అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని మినీ
కాన్ఫరెన్స్ హల్ లో.... జిల్లా లో
పెట్రోలు, డీజిల్ సరఫరాపై పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా...
జిల్లాలో వివిధ పెట్రోలియం సంస్థలలో ఉన్న పెట్రోలు, డీజిల్ నిల్వల గురించిన వివరాలను అధికారులను, ఆయా సంస్థల ప్రతినిధులను
కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... తహసీల్దార్, పోలీస్, లీగల్ మెట్రాలాజి అధికారులు నిరంతరం ప్రతీ బంక్ ని తనిఖీ చేసి... ఇందన నిల్వ లను పరిశీలించాలన్నారు
జిల్లాలో పెట్రోలు, డీజిల్ కృతిమ కొరత సృష్టించకూడదని....బాటిళ్లు, క్యాన్లలో పోయడం ద్వారా వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు.
పెట్రోల్ బంకుల్లో క్యూ లో ఉన్న వాహనదారులకు పెట్రోల్, డీజిల్ పోయాలని అన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా..
పెట్రోలియం సంస్థ ల ప్రతినిధులు కూడా ఏ రోజుకు ఆరోజు ఇండెంట్ ప్రకారం గా ఇందనం సరఫరా అయ్యేలా చూడాలన్నారు
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ బెన్ షాలోం, ఆర్డివో లు గోపీరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్,సివిల్ సప్ప్లై డి ఏం హతీ రామ్,
లీగల్ మెట్రాలాజి అధికారి ఝాన్సీ, జిల్లా వైద్య శాఖ అధికారి మల్లికార్జున రావు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు,
పెట్రోలియం సంస్థ ల ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు