• Other News
  • Live TV
  • హమాలీ కూలీలను పెంచి నాణ్యమైన ధాన్యం సేకరణకు ఆదేశాలు ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఎండల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి

    Reporter
    admin April 29, 2026, 2:53 pm
      హమాలీ కూలీలను పెంచి నాణ్యమైన ధాన్యం సేకరణకు ఆదేశాలు  ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఎండల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి

    కమాన్ పూర్, ఏప్రిల్ - 29: జిల్లాలో నాణ్యమైన ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

    కమాన్‌పూర్ మండలంలోని గుండారం ఐకెపి సెంటర్‌ను, ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ మంది హమాలీ కార్మికులను సమకూర్చి వేగవంతంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

    వేసవి తీవ్రత దృష్ట్యా రైతులకు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకేట్లు, త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

    అనంతరం ఉపాధి హామీ పనుల కింద చేపట్టిన ఎస్సారెస్పీ కెనాల్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్రాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

    ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కాలిందిని,సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర