99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక "పర్యాటక వారోత్సవాల" నేపథ్యంలో...బుధవారం హెరిటేజ్ వాక్ లో భాగం గా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లింగాల ఘనపూర్ మండలం
జీడికల్ గ్రామ చౌరస్తా నుండి అతి పురాతనమైన ఆలయం శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం వరకు హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు..
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...
సుసంపన్నమైన చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు తెలియజేయాలన్నారు
జిల్లా పర్యాటక ప్రాంతాల ఉనికి
భావితరాలకు అందించాలని...జిల్లాలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను
యువత, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నారు
ఆనంతరం...
శ్రీరాముడి వీరత్వానికి ప్రతీతిగా... రెండో భద్రాద్రిగా పేరొందిన ఈ దేవాలయానికి కలెక్టర్ దర్శనానికి వెళ్లగా.... ఆలయ పూజారులు వేద మంత్రాలతో కలెక్టర్ కి స్వాగతం పలికారు
స్వామి వారి దివ్య దర్శనం అనంతరం... పూజారులు కలెక్టర్ కి వేద ఆశీర్వచనం ఇచ్చారు
చివర గా టూరిజం గైడ్ కి సంబందించిన పోస్టర్ ని కలెక్టర్, అధికారులు, ఆలయ చైర్మన్, పూజారులు ఆవిష్కరించారు
ఈ కార్యక్రమం లో
టూరిజం అధికారి నర్సింహా రావు,ఎంపీడీఓ, జి సి డి ఓ, సర్పంచ్,ఆలయ ఆలయ చైర్మన్, ఈఓ, గ్రామస్తులు, TSS కళాకారులు పాల్గొన్నారు