నేటి ప్రభాత దర్శిని నిజామాబాద్ అర్బన్ జూన్ 6
[12:54 PM, 6/5/2026] Susheel.kumar.nzb: అవినీతి మరియు జిల్లా అభివృద్ధిపై రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేకనే. బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లాలోని బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తుతము రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేకనే ఎటువంటి అవగాహన లేకుండానే బిగాలా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాజీ ఎమ్మెల్యే బిగాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు, ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అర్బన్ ఎమ్మెల్యే బిగాల నిజామాబాద్ నగరానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారని, తాను అధికారం కోల్పోయానని బాధతో అసహనంతో ఏమాత్రం అవగాహన లేకుండా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ విమర్శించారు, ఇంకా ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 60 స్థానాల్లో కేవలము ఒక సీటును గెలుపొంది తిరిగి కనీసము ఆ ఒక్క సీటును కూడా కాపాడుకోలేని అసమర్త్త నాయకుడు మాజీ ఎమ్మెల్యే బిగాల అని, అర్బన్ ఎమ్మెల్యే ఈ సందర్భంగా బిగాలపై మండిపడ్డారు.
కాగా తాను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గతంలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి పరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నానని ఇది జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే బిగాల తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు.
ఇంకా ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బిగాల పదేళ్లు అధికారంలో ఉన్న అర్బన్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ప్రజలకు ఇప్పించలేదని, అదేవిధంగా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎటువంటి చొరవ చూపలేదని మరి, ఇప్పుడు తనను రాజీనామా చేయమని అడుగుతున్న. బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బీగాల గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ని రాజీనామా చేయమని ఎందుకు అడగలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ బిగాలను సూటిగా ప్రశ్నించారు అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ లో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా రాలేదని మరి ఈ విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే బీగాల నాటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటి శాఖను నిర్వహించిన కేటీఆర్ ను రాజీనామా చేయమని మాజీ ఎమ్మెల్యే బిగాలా కేటీఆర్ ను ఎందుకు అడగలేదని, కేవలము తాను ఆర్థికంగా అభివృద్ధి చెందటం కొరకే మాజీ ఎమ్మెల్యే బీగాల గత పది ఏళ్ల తన పదవి కాలంలో పనిచేశారని అంతేకానీ నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు ఎటువంటి కృషి చేయలేదని, కేవలము కమిషన్ కరప్షన్ కలెక్షన్లకు అలవాటు పడి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు మాజీ ఎమ్మెల్యే బిగాలా తన స్వప్రయోజనాల కోసమే పని చేశారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఎద్దేవ చేశారు కానీ తాను గత రెండున్నర సంవత్సరాల తన పదవీకాలంలో నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు పలుమార్లు నిజామాబాద్ జిల్లా కు సంబంధించిన అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావడంతో, జిల్లాకు చెందిన మంత్రులు నిజామాబాద్ నగరంలో సుమారు 396 డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. అలాగే నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు తాను త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మీడియాకు వెల్లడించారు.
[12:54 PM, 6/5/2026] Susheel.kumar.nzb: చర్చకు సిద్ధం:-కాగా తనపై బి ఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆరోపణలకు సమాధానంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బిగాలకు సవాల్ విసిరారు, గత రెండున్నర ఏళ్ల తన పదవీకాలంలో నిజాంబాద్ నగరంలోని ఏ శాఖలోనైనా తాను ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడినట్టు బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే నిరూపిస్తే తాను బహిరంగ చర్చకు సిద్ధమని అర్బన్ ఎమ్మెల్యే ఈ సందర్భంగా బిగలకు సవాల్ విసిరారు, ఇంకా ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ మాట్లాడుతూ తాను ఈ విషయంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా లో గల గణపతి ఆలయం ముందుకు తాను వస్తానని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బిగాల కూడా అక్కడికి వచ్చి తన అవినీతిని నిరూపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ బిగాలను కోరారు.
ఇంకా ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తన హయంలో తాను ఒక్క గుంట భూమి కూడా కొనుగోలు చేయలేదని కానీ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాత్రం నిజామాబాద్ నగరంలో అనేక కబ్జాలకు పాల్పడి ఒక్క గుంట భూమి కూడా వదల లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ బిగాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు, అదేవిధంగా ఆర్య వైశ్యులు అంటే దానధర్మాలకు ప్రతీకగా ఉంటారని కానీ మాజీ ఎమ్మెల్యే బీగాల మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాజీ ఎమ్మెల్యే బిగాలపై ధ్వజమెత్తారు ఇంకా ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి బిజెపి ఫ్లోర్ లీడర్ ప్రమోద్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్ మఠం పవన్ బంటు ప్రీతి ప్రవీణ్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ కల్పే అర్చన చిరంజీవి మమతా శివ సీనియర్ నాయకులు న్యాలం రాజు పుట్ట వీరేందర్ బీజేవైఎం రాష్ట్ర కో కార్యదర్శి విజయ్ ఇల్లెందుల ప్రభాకర్ గిరిబాబు తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
TELANGANA NIZAMABAD
కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేకనే నాపై అసత్య ఆరోపణలు.
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **