ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా వేములవాడలో గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ గారిని తన కార్యాలయంలో కలిసి సర్వే కరపత్రాలను అందించి సర్వే ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వేములవాడలో సర్వే చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను,గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన,అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు.తొలి విడతలో కుటుంబ యజమాని పేరు,సభ్యులు వారి విద్యా అర్హతల గురించి,చదువు మానేసిన,ఉన్నత చదువులు,వృత్తివిద్య కోర్సులు,ఉద్యోగం,స్వయం ఉపాధి,వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో,ఎన్ని గంటలు పని చేశారో,ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలు , మరియు ఆన్లైన్ ఆర్డర్స్ ,ప్లాట్ఫారం వర్కర్స్, గిగ్గు వర్కర్స్ జొమాటో, స్విగ్గి , రాపిడో ,ఓలా , ఉబర్ వంటి ఆన్లైన్ ఆర్డర్స్ లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క విషయాలను నమోదు చేసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ మరియు మేనేజర్ సంపత్ రెడ్డి , ఎంపీఎస్ఓ, తిరుపతి, కార్పొరేటర్ అన్నారం శ్రీనివాస్, , మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ రోజా, మరియు మున్సిపల్ బిల్ కలెక్టర్ ముంజ రమేష్ గౌడ్, మరియు మున్సిపల్ మెప్మాసెక్షన్ సిబ్బంది వరాల శోభ , ఆర్పీ పోసు మంజుల
మరియు మున్సిపల్* సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
TELANGANA RAJANNA SIRCILLA
వేములవాడలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహణ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **