• Other News
  • Live TV
  • ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

    Reporter
    admin April 24, 2026, 3:47 pm
    ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి  అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

    వేములవాడ/ బోయినపల్లి, ఏప్రిల్ - 24
    కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.

    వేములవాడ మండలం అనుపురం, బోయినపల్లి మండలం విలాసాగర్, జగ్గారావుపల్లి, కొదురుపాకలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో శుక్రవారం పరిశీలించారు.

    రైతుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తేమ శాతాన్ని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాలు పడితే ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

    రైస్ మిల్లుల్లో తనిఖీ

    బోయినపల్లి మండలం విలాసాగర్ లోని సస్య లక్ష్మి, స్వస్తిక్ ఇండస్ట్రీస్, జగ్గారావుపల్లిలోని సుహాస్ ఆగ్రో రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లులకు ధాన్యం లోడ్ తో వచ్చిన వాహనాలను ఆలస్యం చేయకుండా దింపుకొని వాహనాలు తిరిగి కొనుగోలు కేంద్రాలను వెళ్లేలా సహకరించాలన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర