• Other News
  • Live TV
  • మేడే వేడుకలు - 2026 (01-05-2026 నుంచి 10-05-2026) విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin April 29, 2026, 4:18 pm
    మేడే వేడుకలు - 2026 (01-05-2026 నుంచి 10-05-2026) విజయవంతం చేయాలి  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    ఏప్రిల్ 29
    జనగామ మేడే వేడుకలు - 2026 బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, మేడే కార్మిక వారోత్సవాల కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన మేడే వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మేడే (మే 01) కార్మిక దినోత్సవాన్ని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మే 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేడే వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండలంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు.

    ఈ మేడే ఉత్సవాల కార్యక్రమంలో ఉత్తమ నిర్వహణ (Best Management), ఉత్తమ అధికారిని (Best Officer) సన్మానించాలన్నారు. ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని, వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

    ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, జిల్లా ఉపాధి అధికారి రవికాంత్, ఐటీఐ ప్రిన్సిపల్, ఆలేరు, ఏఐటీయూసి, సిఐటీయూ, టీబీఎన్ఆర్కేఎస్, ఇతర రంగాల కార్మిక సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర