రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ - 26 ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు.
జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 16 మంది కులాంతర వివాహం చేసుకోగా, ప్రభుత్వ ప్రోత్సాహక కోసం ఎస్సీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి ఒక్కో జంటకు మంజూరు అయిన రూ. 2,50,000 విలువైన ఫిక్స్డ్ బాండ్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు.
కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.