ఇల్లంతకుంట, ఏప్రిల్ -29ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే బుధవారం సందర్శించారు.
రిజర్వాయర్ సామర్థ్యం, నీటి నిల్వ, తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అంతకముందు అనంతగిరి పోచమ్మ దేవాలయాన్ని కలెక్టర్, ఎస్పీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత, వివరాలను ఆలయ అధికారులను జిల్లా కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీ కార్యదర్శికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.