సిద్దిపేట 26 అక్టోబర్ 2026సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొని వారికి పూల మాల వేసి ఘన నివాళులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....
ఇతిహాసాల్లో మొట్టమొదటి ఆదికావ్యం రామాయణం రచించారు. అలాంటి రామాయణాన్ని రచించింది ఒక బోయ కులానికి చెందిన చోరుడు, ప్రతి ఒక్కరు రామాయణాన్ని నిత్యం వారిని పారాయణం చెయ్యాలి.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో జ్ఞానోదయం అవుతుంది. వాల్మీకి జీవితం ఏ పని చేసిన ధర్మబద్ధంగా మంచి మార్గంలో వెళ్ళాలని, ప్రతి ఒక్కరు ఇది పాటించి వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈయన ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారు ముఖ్యంగా పెద్దబాలశిక్ష అనే పుస్తకంలో అన్ని అంశాలతో కూడినవి నేర్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా అవసరమని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, ఎస్డిసి సుదర్శన్, జడ్పిసిఈఓ రమేష్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సయ్యద్ రఫీ, ఏ ఓ రాజ్ కుమార్, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.