రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ – 26ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 163 అర్జీలు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 04 దరఖాస్తు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు. వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 05 దరఖాస్తులు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు
మండలాల వారీగా..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు ప్రజావాణి ఎంపీడీఓలు నిర్వహించి.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలాల వారీగా దరఖాస్తులు వివరాలు..
బోయినపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి 04, చందుర్తి మండలం 00, ఇల్లంతకుంట మండలం 06, గంభీరావుపేట మండలం 02, కోనరావుపేట మండలం 03, ముస్తాబాద్ మండలం 06, రుద్రంగి మండలం 00, తంగళ్లపల్లి మండలం 01, వీర్నపల్లి మండలం 01, వేములవాడ అర్బన్ మండలం 03, వేములవాడ రూరల్ మండలం 03, ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ కార్యాలయానికి 02 దరఖాస్తులు వచ్చాయి.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని, స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అన్ని చోట్ల అప్లికేషన్లు ఆన్లైన్ చేస్తారని పేర్కొన్నారు.
ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.