• Other News
  • Live TV
  • వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    Reporter
    admin October 27, 2026, 1:08 pm
    వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    (నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి )
    ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 27 :

    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని శ్రీ హరిహర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వేద పండితులు రాధాకృష్ణ శర్మ, రామాచారి, సప్తగిరి, సుధాకర్ శర్మ తదితరులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆది శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ తరఫున చైర్మన్ పాపారావు తీర్థప్రసాదాలు అందజేశారు.

    భక్తిశ్రద్ధల నడుమ రథోత్సవం

    శ్రీ వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపై అలంకరించి, మంగళవాయిద్యాలు, భాజాభజంత్రీలు, భజనల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలో గంభీరావుపేట మండలంతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

    ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హమీద్, సహకార సంఘం చైర్మన్ వేషాల వెంకటి, లింగన్నపేట గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, ఆలయ వైస్ చైర్మన్ జోగు సురేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు మెండే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88