• Other News
  • Live TV
  • బోయినపల్లి మండలం రామన్నపేట అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమం నిర్వహణ, ప్రాథమిక పాఠశాలలో పరిశీలన

    Reporter
    admin October 27, 2026, 4:28 pm
    బోయినపల్లి మండలం రామన్నపేట అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమం నిర్వహణ, ప్రాథమిక పాఠశాలలో పరిశీలన

    బోయినపల్లి, అక్టోబర్ -27 అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను ప్రతిరోజు తల్లిదండ్రులు తప్పనిసరిగా పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు..

    బోయినపల్లి మండలం రామన్నపేట అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా అంగన్వాడి కేంద్రంలో పిల్లల ఎత్తు బరువును పరిశీలిస్తుండగా తనిఖీ చేశారు. సామ్, మామ్ పిల్లలపై ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రంలో ఆరో వాటర్ యంత్రం పనితీరు, ఫ్యాన్లు, లైట్లు పరిశీలించారు. అంగన్వాడి కేంద్ర ఆవరణలో వివిధ రకాల కూరగాయల సాగు చేస్తుండగా సందర్శించారు.

    ప్రాథమిక పాఠశాలలో తనిఖీ

    అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీసి వారితో మాట్లాడారు. విద్యార్థులు అందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.

    ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు బాలింతలు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలకు అన్నప్రాసన చేశారు.

    జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. * ప్రతి మంగళవారం 10 నిమిషాలు* కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.
    కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు.

    ప్రతి రోజూ తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు.

    అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. బాలల మొదటి వెయ్యి రోజుల దశ కీలకమని, వారికి సరైన పోషకాహారం ఇంట్లో సైతం ఇవ్వాలని సూచించారు.

    తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

    దేశంలో దాదాపు 50 శాతం మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని, రక్త హీనతతో ఉన్న మహిళలు ప్రతి ఆరు నెలల ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేకత పెట్టారని తెలిపారు.

    వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రం

    ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు, సరిగా మాట్లాడాలని పిల్లలు, రక్తహీనత పోషకాహారం లోపం గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. అలాగే కరీంనగర్ లో ఎన్ ఆర్ సీ కేంద్రంలో సేవలు అందిస్తారని, ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు.

    ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలన

    గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. అక్కేనపల్లి కావ్య ఇందిరమ్మ ఇంటిని నిర్మాణాన్ని పరిశీలించి.. పురోగతిపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88