• Other News
  • Live TV
  • వచ్చే ఏడాది జూలై వరకు త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలి

    Reporter
    admin October 27, 2026, 2:19 pm
    వచ్చే ఏడాది జూలై వరకు త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు  నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలి

    ఖమ్మం, అక్టోబర్ -27: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను అన్ని విధాలా కాపాడాలని, రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

    మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయం, భూగర్భ జలాలు, మార్కెటింగ్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

    ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కరువు పరిస్థితులు, మండలాల వారీగా భూగర్భ జలాలు తగ్గుతున్న తీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని అన్నారు. ఈ నెలాఖరు నాటికి, వచ్చే నెలలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలను ప్రజలకు వివరించాలని, అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

    ప్రస్తుతం రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న వానాకాలం పంటను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండవ పంట సాగు చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని సూచించారు.

    యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం:
    రాబోయే యాసంగి సీజన్‌లో సాగునీటి లభ్యత ఉండే అవకాశం లేదని మంత్రి తెలిపారు. రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండాలని, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, ఇతర తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.

    ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని, రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బిందు సేద్యం ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు.

    రెండవ పంటకు సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి తక్కువ నీటితో పండే పంటలకు తడులు అందించే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. ఎక్కడా పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడాలని, పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం:
    ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కిన్నెరసాని నీటిని యాసంగి పంటలకు విడుదల చేయవద్దని, అవసరమైతే మిషన్ భగీరథ త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని ఆదేశించారు.

    నాగార్జునసాగర్ పరిధిలోని రెగ్యులేటర్లు, షట్టర్లు, పంపిణీ వ్యవస్థలను మూసివేసి, పాలేరు వరకు ప్రధాన కాలువల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో మూడు పంప్‌హౌస్‌లను వినియోగించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయాలని తెలిపారు.

    పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా నీటి నిల్వలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సమీపంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్టను పెంచి సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది నీటి ఆవిరి నష్టాలు, ఇంకుడు నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలని, పైపులైన్ల లో లీకేజీలను అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై వరకు త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

    త్రాగునీటిని వాహనాల శుభ్రత, తోటల పెంపకం వంటి అవసరాలకు వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకునే అలవాటును ప్రజల్లో పెంపొందించాలని సూచించారు.

    పాత త్రాగునీటి పథకాల పునరుద్ధరణకు చర్యలు:
    మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా గ్రామాల్లో పాత త్రాగునీటి సరఫరా పథకాలను పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట వ్యక్తిగత బోర్లు, ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో త్రాగునీటి పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు.

    నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలి:
    ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి సంరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వీబీ-జీ రామ్‌జీ పథకం నిధులతో ఇంకుడు గుంతలు, బోరు రీచార్జి గుంతలు, వ్యవసాయ కుంటలు వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. వీబీ-జీ రామ్‌జీ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో, అందుబాటులో ఉన్న సుమారు రూ.7,000 కోట్ల నిధులను సమర్థంగా వినియోగించు కోవాలని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు.

    పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు:
    గ్రామాల్లో పశుగ్రాసం ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో పచ్చిగడ్డి పెంపకాన్ని ప్రోత్సహించి పశుగ్రాసం కొరతను అధిగమించాలని తెలిపారు. పశువులకు తగినంత నీరు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు పశుగ్రాసం పెంపకం, సరఫరా బాధ్యతలను అప్పగించే అంశాన్ని పరిశీలించి తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

    పత్తి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి:
    పత్తి, ధాన్యం కొనుగోళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. మార్కెట్‌లో పంటలకు లభిస్తున్న ధరల ప్రయోజనం రైతులకు అందేలా చూడాలని, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్, సిండికేట్లు ఏర్పడకుండా మార్కెటింగ్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.

    విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలి:
    విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాలపై రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, మోటార్లకు ఏర్పాటు చేసిన ఆటో స్టార్టర్లను తొలగించాలని ఆదేశించారు. ఎండిపోయిన బోర్లను వినియోగించకుండా చూడాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో వీధి దీపాలను దశలవారీగా సౌర విద్యుత్‌తో నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నీరు, విద్యుత్ వృథాను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.

    పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ:
    ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాల్లోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలని, ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

    1986లో సుమారు 600 గ్రామాలు వరదల కారణంగా ముంపునకు గురైన సమయంలో ప్రజలకు ఆహారం, త్రాగునీరు అందించి అధికారులు సమర్థంగా పనిచేశారని మంత్రి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికార…

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88