• Other News
  • Live TV
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌ల నిర్వహణ సెలవులు రద్దు.. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin October 27, 2026, 2:20 pm
    అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌ల నిర్వహణ  సెలవులు రద్దు.. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదు  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    అక్టోబర్ 27బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణబ్’ (Arnab) తుఫాను ప్రభావంతో జిల్లాకు అక్టోబర్ 28, 29 తేదీలలో ఎల్లో అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

    ఈ మేరకు విపత్తు నిర్వహణకు సంబంధించి ముందస్తు జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

    కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

    జిల్లా కలెక్టరేట్‌లో అక్టోబర్ 27వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 24 గంటల పాటు జిల్లా ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. కంట్రోల్ రూమ్ నోడల్ అధికారిగా సి-6 సెక్షన్ సూపరింటెండెంట్ వ్యవహరించనుండగా, మొత్తం బాధ్యతను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పర్యవేక్షిస్తారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08716-1077 అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ప్రతి తహశీల్దార్ కార్యాలయంలోనూ మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

    అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు

    జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, టీజీఎన్‌పీడీసీఎల్ ఇంజనీరింగ్ అధికారులు, వైద్యాధికారులు, వ్యవసాయాధికారులు, గ్రామ పాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అక్టోబర్ 27 నుంచి 31వ తేదీ వరకు మంజూరైన అన్ని రకాల సెలవులను రద్దు చేశారు. కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ఏ అధికారి కూడా తమ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు.

    చెరువులు, నీటి వనరులపై నిరంతర పర్యవేక్షణ

    జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లలో ప్రస్తుత నీటి నిల్వల వివరాలను అక్టోబర్ 27వ తేదీ నాటికి అందజేయాలని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఎఫ్‌టీఎల్ స్థాయిలో (లేదా) అంతకంటే ఎక్కువ నీరు ఉన్న ప్రతి చెరువు వద్ద లస్కర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లను 24 గంటల పాటు కాపలాగా ఉంచాలి. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, మండల కేంద్రాల్లో ఇసుక బస్తాలు, ఖాళీ గోనె సంచులు, ఎర్త్ మూవింగ్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

    కాజ్‌వేలు, వంతెనల వద్ద భద్రతా చర్యలు

    తక్కువ ఎత్తులో ఉన్న కాజ్‌వేలు, వంతెనల వద్ద అక్టోబర్ 27వ తేదీ నాటికి బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తున్నప్పుడు ఇరువైపులా ట్రాఫిక్‌ను వెంటనే నిలిపివేసి, పోలీసులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందిని పహారాగా ఉంచాలి. నీటి లోతుతో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను కాజ్‌వేలు దాటేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు.

    విద్యుత్ సరఫరాపై అప్రమత్తత

    టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులు ప్రతి విద్యుత్ సెక్షన్ పరిధిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచుకోవాలి. నీట మునిగిన ప్రాంతాలు, కాలనీలలో విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేయాలి. భారీ వర్షాల సమయంలో ప్రాణనష్టం జరగకుండా తెగిపడిన విద్యుత్ తీగలు, వంగిన విద్యుత్ స్తంభాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు.

    ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు

    జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను వర్షం నుంచి రక్షించేందుకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. ధాన్యం బస్తాలను నేలపై కాకుండా ప్లాట్‌ఫారమ్‌లపై నిల్వ చేయాలి. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం రవాణాను అక్టోబర్ 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    పాఠశాలలు, వసతి గృహాల్లో భద్రతకు ప్రాధాన్యం

    శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన పాఠశాలలు, హాస్టళ్లలో తరగతులు నిర్వహించరాదు. వర్షం కురుస్తున్న సమయంలో విద్యార్థులను బయటకు పంపడం, వాగులు, కాజ్‌వేలు దాటించడం చేయకూడదు. వర్షపాత పరిస్థితులను సమీక్షించి, అక్టోబర్ 28వ తేదీ ఉదయం పాఠశాలల సెలవులపై కలెక్టర్ తగిన నిర్ణయం తీసుకుంటారు.

    వైద్య, ఆరోగ్య సేవలు సిద్ధంగా ఉంచాలి

    ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, పాము కాటు నివారణకు అవసరమైన మందులు, క్లోరిన్ బిళ్లలు అందుబాటులో ఉంచి వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలి. మండల కేంద్రాల్లో 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి. మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని క్లోరినేషన్ చేసి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలి.

    ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి

    ఉప్పొంగి ప్రవహించే వాగులు, కాలువలు, కాజ్‌వేలను దాటవద్దని ప్రజలకు చాటింపు ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలి. వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడరాదని సూచించాలి. చేపల వేటకు వెళ్లడం, బట్టలు ఉతకడం వంటి పనుల కోసం చెరువుల వద్దకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

    తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
    జనగామ

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88