• Other News
  • Live TV
  • విద్యతో పాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించాలి ప్రతి విద్యార్థిని ఏదో ఒక క్రీడలో నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin October 27, 2026, 2:17 pm
    విద్యతో పాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించాలి  ప్రతి విద్యార్థిని ఏదో ఒక క్రీడలో నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలి  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    అక్టోబర్ 27
    జనగామ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

    మంగళవారం, జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో పీఎం శ్రీ పాఠశాలలు - విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి CWSN (ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు) 2026-27 ఆటలు, క్రీడా పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, ఆటలు, క్రీడా పోటీలను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మనసులో ఆందోళనలు, బాధలు ఉన్నప్పుడు క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉపశమనం పొందవచ్చని, ఆటలు, క్రీడలు ఆడటం ద్వారా ఉత్సాహంగా, సానుకూల దృక్పథంతో పనులు చేయగలుగుతారని పేర్కొన్నారు.

    క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. చిన్న వయసు నుంచే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు.

    ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, వారి కృషి ఫలితంగానే జనగామ జిల్లా విద్యా రంగంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3,000 మంది విద్యార్థులు అదనంగా చేరడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా, క్రీడా సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    విద్యార్థులు చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెస్ ఆడటం వల్ల ఆలోచనా సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడతాయని వివరించారు. టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలు ఏకాగ్రత, వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో పారా ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు వంటి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

    తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా, కనీసం ఒక క్రీడలోనైనా నైపుణ్యం సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, సమానత్వ భావన, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ఇవి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయని వివరించారు.

    ఈ జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమంలో విద్యార్థులు ఇండోర్, అవుట్‌ డోర్ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని, తమలోని ప్రతిభను వెలికితీయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న క్రీడా సదుపాయాలను వినియోగించుకుని, క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి గోర్ సింగ్, సీఎంఓ యాదగిరి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88